టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. భారత వింగ్ కమాండర్ అభినందన్ జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో నటించేందుకు విజయ్ పచ్చజెండా ఊపినట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్‌తో హిందీ చిత్రం తెరకెక్కించాలని అక్కడి నిర్మాతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించనున్న సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. బాలాకోట్ దాడుల నేపథ్యంలో తెరకెక్కించే ఈ సినిమాలో వింగ్ కమాండర్ అభినందన్ పాత్రలో విజయ్ నటించనున్నట్లు సమాచారం. గతేడాది భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య జరిగిన దాడిలో భారత వింగ్ కమాండర్ అభినందన్ పాక్ సైన్యానికి చిక్కారు. మూడు రోజుల తర్వాత పాకిస్థాన్ ఆయన్ని భారత ప్రభుత్వానికి అప్పగించింది. శత్రు దేశానికి చిక్కినా ఎంతో ధైర్యంతో వ్యవహరించిన అభినందన్‌పై దేశమంతా ప్రశంసలు కురిపించింది. ఈ ఘటన ఆధారంగా అభిషేక్ కపూర్ సినిమా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ నచ్చడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ అనే మూవీలో నటిస్తున్నాడు.
previous post

