telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఘనంగా బాయ్ ఫ్రెండ్ బర్త్ డే… ప్రముఖులకు ట్రీట్ ఇచ్చిన నయన్

Nayanatara

లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే వారికున్న డిమాండ్ తగ్గుతుంటుంది. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రేజ్ మాత్రం వయసుతోపాటే పెరుగుతోంది. కాగా… నయన్ ఎప్పట్నుంచో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణాలు సాగించిన నయన్ ప్రస్తుతం విఘ్నేష్‌తో డేటింగ్ చేస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు వీరిద్దరూ తమ బంధం గురించి మాట్లాడలేదు. తాజాగా తన బాయ్‌ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ బర్త్‌డేను నయన్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. బుధవారం విఘ్నేష్ 34వ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నాడు. ఆ ముందు రోజు రాత్రి 12 గంటలకు చెన్నైలోని ఓ కేఫ్‌లో నయన్ గ్రాండ్ పార్టీ ఇచ్చి విఘ్నేష్ చేత కేక్ కట్ చేయించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Related posts