బాలీవుడ్ సీనియర్ నటుడు, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత దిన్యార్ కాంట్రాక్టర్ కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాజీగర్, 36 చైనా టౌన్, ఖిలాడీ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు దిన్యార్. హిందీ, గుజరాతీ సినిమాలతో పాటు పలు టీవీ షోలలో కూడా ఆయన నటించారు. నటన మీద ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే రంగస్థల నటుడిగా కెరీర్ ఆరంభించిన ఆయన 1966 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు 2019లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన మరణ వార్త తెలిసిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

