హీరో వెంకటేశ్ మరో హిట్ రీమేక్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ‘అసురన్’ తెలుగు రీమేక్ రూపొందిన ‘నారప్ప’ ఓటీటీలో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇందులోని వెంకీ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.ఈ క్రమంలోనే వెంకీ మరో రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట.

తమిళ స్టార్ అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘ఎన్నై అరిందాల్’ను తెలుగులో చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2015లో విడుదలైన ఈ మూవీ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇదే చిత్ర రీమేక్‌లో వెంకీ నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కాగా.. ప్రస్తుతం వెంకటేశ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘ఎఫ్3’లో నటిస్తున్నారు

