telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సాహో” కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే ?

Saaho

“బాహుబ‌లి” చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ చిత్రం “సాహో”. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, ఎవ్లిన్‌ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్‌, మందిరా బేడీ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్ త‌ప్పుకున్న త‌ర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ఆగ‌స్ట్ 30న విడుద‌ల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్, సాంగ్స్ విడుద‌ల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. “సాహో” చిత్ర ఆడియో వేడుక‌ని దేశంలోని ముఖ్య ప‌ట్ట‌ణాల‌లో జ‌ర‌పనున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఆగ‌స్ట్ 17న హైద‌రాబాద్‌లో, 21న కొచ్చిన్‌లో, 25న బెంగ‌ళూర్‌లో, 27న ముంబైలో ఆడియో ఫంక్ష‌న్ జ‌ర‌ప‌నున్నార‌ట‌. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌ల‌సి ఉంది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే విషయం చర్చనీయాంశంగా మారింది. సినిమా బడ్జెట్ విషయానికొస్తే కోట్లాది రూపాయలు ఈ చిత్రం కోసం ఖర్చు పెట్టారు. యూరప్, దుబాయ్ లాంటి దేశాల్లో భారీ షెడ్యూల్స్ చేసారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కోసం ఏకంగా 50 కోట్లకు పైగానే ఖర్చు చేసారు. పైగా యాక్టర్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గలేదు. కేవలం రెమ్యునరేషన్స్ కోసమే 50 కోట్లకు పైగా ఖర్చు చేసారు నిర్మాతలు. అది కూడా ప్రభాస్ మినహాయించి. బాహుబలి కోసం నాలుగేళ్లకు పైగా కష్టపడ్డాడు కాబట్టి ఆయనకు 50 కోట్లకు పైగా పారితోషికం అందింది. ఇప్పుడు “సాహో” కోసం కూడా రెండేళ్లకు పైగానే టైమ్ కేటాయించాడు ప్రభాస్. దీనికి పారితోషికం కాకుండా వాటా తీసుకుంటున్నాడు ప్రభాస్. ఒకటి రెండు కాదు.. సాహో ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సగం వాటా తన పారితోషికం కింద తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతుంది. సాహో 300 కోట్ల వరకు బిజినెస్ చేస్తుంది. ఈ లెక్కన ప్రభాస్ ఈజీగా 100 నుంచి 150 కోట్ల మధ్య రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇదే కానీ నిజమైతే ఇండియన్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ పక్కన నిలుస్తాడు ప్రభాస్.

Related posts