telugu navyamedia
సినిమా వార్తలు

‘దృశ్యం 2’ ట్రైలర్ విడుద‌ల‌..

విక్ట‌రీ వెంకటేశ్ హీరోగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్ సినిమా ‘దృశ్యం-2’ 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన విషయం తెలిసిందే. ట్రైలర్ విడుదలైంది. ఇందులో వెంకటేశ్, మీనా జంటగా న‌టిస్తున్నారు. జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబరు 25న అమెజాన్ ప్రైమ్​ ఓటీటీలో నేరుగా విడుదల చేయనున్నారు.

దృశ్యం 2' ట్రైలర్.. పోలీసులకు రాంబాబు చిక్కాడా?

తాజాగా ‘దృశ్యం-2’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మ‌న రాంబాబు తెలుసుగా ..కేబుల్ టీవీ అంటూ మొద‌లైంది..’ఇప్పుడు రాంబాబు ఫోకస్‌ మొత్తం సినిమా తీయడం మీద ఉంది. చట్టానికి దొరకనన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. వాడు సినిమా తీసేలోపు.. వాడికి సినిమా చూపిద్దాం’ అనే డైలాగ్​ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.నా కొడుకు చంపినందుకు ఆ ఫ్యామిలీలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తీ రోజు ఏడ‌వాలి అంటూ నదియా చెప్పిన ఏమోష‌న్ డైలాగ్ బాగుంది.

దృశ్యం-2' ట్రైలర్.. అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా రిలీజ్.. ఎప్పుడంటే? - TNews  Telugu

భ‌య‌ప‌డ‌కు మీ ముగ్గురికీ ఏమీ జ‌ర‌గ‌దు..జ‌ర‌గ‌నివ్వ‌ను అనే వెంక‌టేష్ తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు రాంబాబు ఎలాంటి ఎత్తులు వేశాడు? ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? కథలో ప్రతీ మలుపు అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా నదియా, నరేశ్‌, సంపత్‌ రాజ్‌, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో కన్పించనున్నారు.

Related posts