telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీటీడీ అదనపు ఈవో గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి

టీటీడీ ప్రక్షాళనకు నడుం బిగించింది టిడిపి కూటమి ప్రభుత్వం.

గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని భావించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే సిన్సియర్, సీనియర్ అధికారులను టీటీడీ బాధ్యతలలో నియమిస్తున్నారు.

టీటీడీ ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే శ్యామల రావును నియమించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

టీటీడీ జేఈవోగా మరో సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన జేఈవోగా చిరుమామిళ్ల వెంకయ్య చౌదరి నియమితులయ్యారు.

ఈవో గా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి క్షేత్ర సంప్రదాయ ప్రకారం తలనీలాలు సమర్పించి, ముందుగా భూ వరాహస్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్యచౌదరి

దర్శనాంతరం రంగనాయకుల మండపంలో అదనపు ఈవో బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి

Related posts