telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కులభూషణ్ జాదవ్‌ పై వీణామాలిక్ ట్వీట్… సినీ కెరీర్ కు ఎండ్ కార్డు

Veena-Malik

పాకిస్థాన్‌కి చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ చేసిన ట్వీట్ మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇటీవల అంతర్జాతీయ కోర్టు కులభూషణ్ జాదవ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పాక్ కోర్టు విధించిన తీర్పును నిలిపివేసింది. భారత్, పాక్ జడ్జిలు సహా 16 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం.. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. పాక్ మిలటరీ కోర్టు విధించిన శిక్షను పున:సమీక్షించాలని న్యాయమూర్తులు సూచించారు. వియాన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందన్న భారత్ వాదనను 15 మంది జడ్జిలు సమర్థించారు. ఈ కేసులో జాదవ్ తరఫున న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే హక్కు భారత్‌కు ఉందని జడ్జిలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్‌ కథ ఏంటంటే… 2016లో కుల్‌భూషణ్ జాదవ్‌ను బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో పాకిస్తాన్ బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అక్కడి మిలిటరీ కోర్టు… 2017లో అతడికి మరణ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసింది. పాక్ చర్యను తీవ్రంగా తప్పుబట్టింది. అమాయకుడైన కులభూషణ్ జాదవ్‌‌ను దోషిగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి.

అయితే అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వీణామాలిక్ వివాదాస్పద ట్వీట్ చేసింది. ఉగ్రవాదులపై జాలి చూపకూడదని, వాళ్లను సరిహద్దుల్లో ఉరి తియ్యాలని, అప్పుడే ఇండియాకి చెందిన ఉగ్రవాదులు, గూడఛారులకు బుద్ధి వస్తుందన్నట్లుగా ట్వీట్ చేసింది. దీంతో నెటిజన్లు ట్రోలింగ్ తో ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆమెకు హిస్టరీ అంతా చెప్పి స్పెషల్ క్లాస్ తీసుకున్నారు. బాలీవుడ్ సినిమాల్లో బోల్డ్ సీన్లతో అభిమానులను సంపాదించుకునేందుకు ట్రై చేసి ఫెయిలైన వీణా మాలిక్… ఇలాంటి వివాదాస్పద కామెంట్లతో క్రెడిట్ సంపాదించుకోవడాని ట్రై చేస్తోంది. ఆమె కెరీర్‌కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుంది అంటూ ఫైర్ అవుతున్నారు.

Related posts