telugu navyamedia
సినిమా వార్తలు

ఇండస్ట్రీలోమ‌రో జంట‌ విడాకులు…18 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి

సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు విడిపోతున్నారు.

ఇప్పటికే సమంత, ధనుష్‌, అమీర్‌ ఖాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు.

కోలీవుడ్‌లో విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ బాల దంప‌తులు విడిపోయారు. 18 ఏళ్ల వివాహ బంధానికి వారు విడాకుల‌తో ఫుల్‌స్టాప్ పెట్టారు. నాలుగేళ్లుగా వీరిద్ద‌రూ విడిగానే ఉంటున్నారు.

గత నాలుగేళ్లుగా బాల, మధుమలార్‌ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇక దర్శకుడి బాల.. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు.

ఆయన దర్శకత్వం వహించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.

అలాగే 2008లో బాల ‘నాన్ కాదవుల్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. తాజాగా సూర్యతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts