telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అన్నదాతలకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి వంగలపూడి అనిత

అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నుముక అని ఉద్ఘాటించారు.

రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందని పేర్కొన్నారు. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.

ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కాడెడ్లతో నాగలి పట్టుకొని హోం మంత్రి అనిత పొలం దున్నారు.

ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు.

టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని హోంమంత్రి అనిత వివరించారు.

పాడిపంటలతో ఏపీ సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరుకున్నారు.

Related posts