telugu navyamedia
సినిమా వార్తలు

తెలుగమ్మాయి కన్నడ ఎంట్రీ

Dimple-Hayathi

ప్రభుదేవ, తమన్నాలు హీరోహీరోయిన్లుగా నటించిన “దేవి-2” చిత్రంలో కీల‌క పాత్ర పోషించిన డింపుల్ హ‌య‌తి తెలుగు అమ్మాయి. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వరుణ్ సందేశ్ “వాల్మీకి” చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోని మేక‌ర్స్ చిరు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు శాండ‌ల్‌వుడ్‌లో త‌న అదృష్టం ప‌రీక్షించుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్రముఖ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు చంద్ర‌మౌళి… “దేవి-2″లో డింపుల్ ప‌ర్‌ఫార్మెన్స్ న‌చ్చి త‌న తాజా చిత్రం కోసం ఎంపిక చేశాడు. క‌న్న‌డ మూవీలో డింపుల్ ప్ర‌ధాన పాత్ర చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం క‌న్న‌డ నేర్చుకునే ప‌నిలో బిజీగా ఉంది డింపుల్ హ‌య‌తి. ఇక తెలుగులో కూడా డింపుల్ హయాతి మంచి అవకాశాలను చేజిక్కించుకుంటుందని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.

Related posts