telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు… బండ్ల గణేష్ వ్యాఖ్యలు

bandlaganesh request on movie event

“గబ్బర్ సింగ్” సినిమా విడుదలై మే 11తో 8 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర దర్శక, నిర్మాతల మధ్య వివాదం రాజుకుంది. “గబ్బర్ సింగ్” ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.. నిర్మాత బండ్లను వదిలేసి మిగిలిన అందర్నీ గుర్తు చేసుకుని ట్వీట్ చేయడంతో బండ్ల గణేష్ ఫీల్ అయ్యారు. దీంతో హరీష్ శంకర్‌ను ఓ రేంజ్‌లో ఏకిపారేశారు. దీంతో ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారు బాస్ అంటూ బండ్ల గణేష్‌కి గట్టి కౌంటర్ ఎటాక్ ఇచ్చారు హరీష్. “బై మిస్టేక్ అలా బండ్ల గణేష్ పేరు మరిచిపోయా కాని.. కావాలని కాదు.. ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చినట్టు? బాస్” అంటూ ఫైర్ అయ్యారు హరీష్ శంకర్. ఆయన ట్వీట్ పై స్పందించిన బండ్ల గణేష్ “తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక… లేని మాటలు అంటకడతారు” అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ డైరెక్టర్ హరీష్ శంకర్ ను ఉద్దేశించే చేశారని చెప్పుకుంటున్నారు.

Related posts