రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’ మూవీతో బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమయ్యాడు. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై పవన్‌ను చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా.. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. అయితే విడుదలైన నిముషాల్లోనే ఈ ట్రైలర్ సంచలనం క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం వకీల్ సాబ్ టీమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. చూడాలి మరి ట్రైలర్ సృష్టించిన సునామీని ఆ రోజు సినిమా కూడా సృష్టిస్తుందా… లేదా అనేది.
previous post
next post


ఉద్యమ నాయకుడు సీఎం కావడం ప్రజల అదృష్టం: తలసాని