దుబ్బాక ఉప ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల మధ్య వేడి కూడా రాజుకుంటోంది. పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజా సమస్యపైన కాంగ్రెస్ పోరాటం ఆగదని…ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదని… పోలీసులు అయితే ఉద్యోగులం అని మర్చిపోయారని ఎద్దేవా చేశారు.
ఐపీఎస్ కాదు కెపిఎస్… కల్వకుంట్ల ప్రైవేట్ సైన్యం లా పోలీసులు తయారు అయ్యారని ఫైర్ అయ్యారు. ప్రజల సమస్యలపై ప్రతిపక్షంగా నిరంతర పోరాటం ఉంటుందని… ఎక్కడ ఆగేది లేదన్నారు. మీకు అండగా మేము ఉంటామని హామీ ఇచ్చారు. ఇందిరా గాంధీ ఓటమి పాలు అయినపుడు యూత్ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాటాలు చేసిందని… తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసారు. మన పోరాటాలు ప్రజల కోసమే..సమస్యల పరిష్కారంలో మనం ముందుండాలని పిలునిచ్చారు.

