telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపాసన గిఫ్ట్ తో రామ్ చరణ్ బర్త్ డే

ram charan

బర్త్ డే బాయ్ రామ్ చరణ్ కు రాజమౌళి మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన చేస్తోన్న రౌద్రం రణం రుథిరం సినిమాలో చెర్రీ లుక్ విడుదల చేశాడు. దీంతో రామ్ చరణ్ పుట్టిన రోజునా రాజమౌళి గిఫ్ట్‌తో అభిమానులంతా పండగ చేసుకున్నారు. అందులో అల్లూరిగా రామ్ చరణ్ నిప్పులు పుట్టించాడు. అయితే ఏడాది లాక్ డౌన్‌తో బర్త్ డే రోజున రోజున ఇంటికే పరిమితమైయ్యాడు రామ్ చరణ్. ఇక, ఇంట్లోనే తన భార్యతో కలిసి బర్త్ డే వేడుకల్ని సెలబ్రేట్ చేసుకున్నాడు చెర్రీ. ఉపాసనతో రామ్ చరణ్ తన బర్త్ డేను సాదాసీదాగా జరుపుకున్నారు. బయట బ్యాకరీలు, కేక్ షాపులు కూడా ఎక్కడా అందుబాటులో లేవు. ఈ సారి చరణ్ పుట్టిన రోజుకు ఉపాసన స్వయంగా కేక్ తయారు చేసి భర్త చరణ్‌కు గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేసింది. ‘బర్త్ డే కేక్‌ను ఎంజాయ్ చేస్తావని నేను అనుకుంటున్నాను.. నా యూట్యూబ్ ఛానల్ చూసి నేనే తయారు చేశా’ అని ట్వీట్‌లో పేర్కొంది. దీంతో చెర్రీ తన భార్య ఉపాసన ఎంతో ప్రేమగా తన కోసం చేసిన కేక్‌ను కట్ చేశాడు. ఆ ఫోటోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన భార్య ఇచిన గిఫ్ట్ తోనే కేక్ కటింగ్ జరిపినట్లు చెప్పుకొచ్చాడు.

Related posts