telugu navyamedia
సినిమా వార్తలు

మేము సినిమా తీస్తే నువ్వు టికెట్లు అమ్ముతావా? మాడి మసైపోతారు..

మేనల్లుడు సాయి తేజ్‌ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రిపబ్లిక్‌’.హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈ వెంట్‌లో ముఖ్య అతిథిగా మెగా ప‌వ‌ర్‌స్టార్ పాల్లొన్నారు.. ఈ సందర్భంగా ఆయన ఉద్వేగభరితంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం..అటు రాజకీయ, సినీ పరిశ్రమల్లో సంచలనం రేపింది.

సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెడితే తాట తీస్తా. నా మీద ఉన్న కోపాన్ని సిని పరిశ్రమ మీద చూపిస్తారా? అంటూ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైసీపీ నేతల మీద మండి పడ్డారు. కళామతల్లికి కులమతాలు ఉండవు. సినీ పరిశ్రమలు అవి అంటించాలని చూస్తే మాడి మసైపోతారు. అందరూ సినిమా వాళ్లను ఈజీగా టార్గెట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ జోలికొస్తే అందరం ఒక్కటవ్వాలని ఆయన ఇండస్ట్రీకి పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమ మీద ఆధారపడి కేవలం హైదరాబాద్ లోనే లక్షల మంది ఉపాధి పొందుతున్నారని పవన్ అన్నారు.

Pawan Kalyan Embarrassed Chiranjeevi

నోరెత్తితే సినిమా వాళ్ల గురించి మాట్లాడుతారు.. మీకు రాజకీయ అవినీతి కనిపించడం లేదా? పొలిటికల్ క్రైమ్ కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. సినిమాల్లో విలువల గురించి కాదు. మీ నిజ జీవితాల్లో విలువలు పాటిస్తున్నారా అని నిలదీశారు. రాజమౌళి బాహుబలి సినిమా తీస్తే మనందరం గర్వించాం. అదీ.. సినిమా స్థాయి. దేశాన్ని మాత్రమే కాదు.. తెలుగు భాషను.. తెలుగు రాష్ట్రాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లగల సత్తా సినిమాకు ఉందని పవన్ అన్నారు.

ఏపీలో సినిమా థియేటర్లు ఎందుకు తెరవడం లేదు?  మేము సినిమా తీస్తే నువ్వు టికెట్లు అమ్ముతావా? సన్నాసి మంత్రి..ప్రభుత్వ ఖజానాలో డబ్బులేవు కాబట్టేసినిమా టికెట్లు ప్రభుత్వమే అమ్ముతుందనే కొత్త విధానానికి తెర తీస్తోందని మండి పడ్డారు.  పవన్ కల్యాణ్ సినిమాలను ఆపేస్తే భయపడిపోతానని అనుకుంటున్నారేమో.. గుండాలకు భయపడితే బతకలేం. నా పేరు చెప్పి చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టాలనుకుంటే తాట తీస్తా అంటూ మండిపడ్డారు.

Pawan Kalyan

తేజ్‌ హై స్పీడ్‌తో వస్తున్నాడని అందుకే యాక్సిడెంట్‌ అయిందని తప్పుగా కథనాలు అల్లారు. ప్రమాదాలు అందరికీ జరుగుతాయి. మాట్లాడేటప్పుడు ఆలోచించాలి. సినిమాల వాళ్లు కూడా మనుషులే! మా మీద కొంచెం కనికరం చూపించండి. ఇలాంటి సమయంలో మాట్లాడాల్సింది తేజ్‌కి జరిగిన ప్రమాదం గురించి కాదు. వివేకానందరెడ్డి ఎందుకు హత్యకు గురయ్యారు? కోడి కత్తితో ఒక నాయకుడిని పొడవడం వెనకున్న కుట్ర ఉంది. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణం ఇలాంటి వాటి మీద కథనాలు ఇవ్వండి. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింసపై మాట్లాడాలి. వైసీపీ నాయకులూ చిత్ర పరిశ్రమను వైపు కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారు. ఇది వైసీపీ రిపబ్లిక్‌.. కాదు ఇండియన్‌ రిప్లబిక్‌’’ అని అన్నారు.

Related posts