telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ తమిళనాడు ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు

బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి గా కేంద్రమంత్రి కిషన్రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నెల 8వ తేదీ తమిళనాడు లో పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎంపికపై చర్చించనున్నారు. మళ్లీ ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై నే ఎంపిక చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

బీజేపీలో జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపికైన వారు వరుసగా రెండేళ్లు ఆ పదవిలో కొనసాగుతారు.

పార్టీ అధిష్టానం సూచనల మేరకు పలు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు.

2026వ సంవత్సరం రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న కారణంగా, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది.

Related posts