telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తండి పొరపాటు వల్ల గోల్ఫ్ బంతికి బలైన చిన్నారి

Golf

కెల్లెన్ హిల్ అనే వ్యక్తి ఆరేళ్ల కూతురు అరియాతో కలిసి ఓరెంలోని స్లీపీ రిడ్జ్ గోల్ఫ్ కోర్స్‌కు గోల్ఫ్ ఆడటానికి వెళ్లాడు. వెంట తీసుకెళ్లిన కూతురును సుమారు 20 అడుగుల దూరంలో నిల్చోబెట్టి ఆటలో మునిగిపోయాడు హిల్. ఈ క్రమంలో అతడు కొట్టిన ఓ షాట్ కూతురికి తగిలింది. తల వెనకవైపు బంతి బలంగా తగలడంతో అరియా అక్కడికక్కడే కుల్పకూలింది. దీంతో వెంటనే చికిత్స కోసం చిన్నారిని సాల్ట్ లేక్ సిటీ ఆసుపత్రికి తరలించారు. కానీ గోల్ఫ్ బాల్ దెబ్బ చిన్నారి తలపై గట్టిగా తగలడం వల్ల ఆమె ఘటనాస్థలి వద్దనే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషాద ఘటనపై ఓరెం పోలీస్ డిపార్ట్‌మెంట్ సంతాపం తెలిపింది. అలాగే అరియా కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. ఊహించని ఈ విషాద ఘటనతో అరియా పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

Related posts