హైదరాబాద్ మహానగరంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నరు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యే ప్రజల్ని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారని చెబుతున్నారు.
ఈ ఏడాది కేంద్ర హోంమంత్రే ఈ కార్యక్రమానికి హాజరు కావటం ఆసక్తికరంగా మారింది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణ విషయంలో ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది తాజా పరిణామం స్పష్టం చేస్తుందని చెబుతున్నారు.
భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన అధికారికంగా షెడ్యూల్ ప్రకటించారు. ఈ నెల ఆరున ఆయన హైదరాబాద్ రానున్నారు.
శనివారం మధ్యాహ్నా వేళకు ఆయన హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటల వేళలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకునే అమిత్ షా మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 4 గంటల వరకు ఐటీసీ కాకతీయ హోటల్లో బస చేయనున్నారు.
ఈ సందర్భంగా మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో రాష్ట్ర బీజేపీ నేతలతో షా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అదే సమయంలో ఐటీసీ కాకతీయ హోటల్ నుంచే ఎస్ఎస్ బీ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ ను వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 3-4 గంటల ప్రాంతంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభిస్తారు.
అనంతరం సాయంత్రం 4.10 గంటల నుంచి 4.55 గంటల మధ్య కాలంలో మొజంజాహీ మార్కెట్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారని చెబుతున్నారు. అనంతరం 5.05 గంటల వేళలో బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుప్రయాణమవుతారు.


బాలయ్య డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదు: పోసాని