ఢిల్లీలోని పార్లమెంట్ సంవిధాన్ భవన్లో జరుగుతున్న ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు, పవన్ కల్యాణ్తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు.
మోదీ పక్కనే చంద్రబాబు, ఆ పక్కన నితీశ్ కుమార్ కూర్చున్నారు. లోక్సభ పక్షనేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయేను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా గడిపారని పేర్కొన్నారు.
ఏపీలో మూడు బహిరంగ సభలు, ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్టు గుర్తుచేశారు. భారీ మెజార్టీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు.
మోదీ నేతృత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు.
ఇప్పుడు వికసిత్ భారత్, ప్లాన్ 2047పై ప్రణాళికలు రూపొందించారని, వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.


