telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు: మంత్రి పేర్ని నాని

perni nani minister

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గరం గరంగా జరుగుతున్నాయి. సభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలకు సంబంధించి సభ్యుల నుంచి వచ్చిన ప్రశ్నలకు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్‌లో రూ. 400 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ఆటో డ్రైవర్ల బాధలను దగ్గర నుంచి చూశారని చెప్పారు. ఆటోడ్రైవర్ల కష్టాలను చూసి వారికి ఏడాదికి రూ.10వేలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో కూడా పొందుపరిచినట్టు తెలిపారు.

Related posts