ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్‌లో సర్కారును మార్చడమే లక్ష్యంగా విరుచుకుపడుతోంది రష్యా ఆర్మీ.
రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. నలువైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి ముప్పేట దాడి చేస్తోంది. వైమానిక దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. సైనికులు, ఆ దేశ పౌరులు కూడా పెద్ద మొత్తంలో మరణించినట్లు తెలుస్తోంది.

అంతటితో ఆగకుండా.. సాధారణ పౌరులు వెళ్తున్న కారుపైకి రష్యాకు చెందిన యుద్ధ ట్యాంక్ దూసుకువెళ్లింది. ఆ కారులో వృద్ధులు ప్రయాణిస్తూ ఉన్నారు. యుద్ధట్యాంక్‌ను ఎక్కించేయడంతో ఆ కారు నుజ్జు నుజ్జు అయింది.
అందులో ఇరుక్కుపోయి కేకలు వేస్తున్న వృద్ధులను స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఉక్రెయిన్ రాజధానిలో పరిస్థితి ఎలా ఉందో చెప్పేందుకు ఈ వీడియో ఉదాహరణ అని ఆ దేశ పౌరులు ట్వీట్లు చేస్తున్నారు.
This is not ok y’all…. #WARINUKRAINE #UkraineRussia #RussiaUkraineConflict #แตงโม #BREAKING #Ukraine pic.twitter.com/6nwRcXz32V
— Official DP (@RealOfficialDP) February 25, 2022

