telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రధానిని కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

Modi wishes to Imran Pakistan

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన లోక్‌స‌భ‌, రాజ్యసభ ఎంపీలు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపుపై వారు ప్రధానంగా ప్రధానితో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నేత జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో పార్టీ కార్యలయం నిర్మించడానికి భూమి కేటాయింపు అంశంపై మోదీతో చర్చించినట్టు తెలిపారు.

ఉభయసభల్లో కలిపి 17మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఉన్నారని.. చట్ట ప్రకారం తమకు 1000 చదరపు గజాల స్థలం వస్తుందన్నారు. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ గైడ్‌ లైన్స్‌ ప్రకారం 1000 చదరపు మీటర్ల స్థలం ఇవ్వాలని చెప్పారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని తమకు కేటాయించాలని ప్రధానిని కోరినట్టు  ఎంపీ పేర్కొన్నారు.

Related posts