telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

అక్రమ సంబంధం : ఓ వ్యక్తి చంపి పూడ్చేసిన టీఆర్ఎస్ నేత !

Crime

అల్వాల్లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ యువకుడిని కిరాతకంగా కొట్టి చంపాడు ఓ వ్యాపారవేత్త కనకరాజు. వివరాల్లోకి వెళితే… కనకరాజుకు ఒక్క అమ్మాయితో అక్రమ సంబంధం ఏర్పడింది. అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయితో, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి కూడా సంబంధం పెట్టుకున్నాడు. 6 నెలల క్రితం అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయిన శ్రీకాంత్ రెడ్డి.. ఈ విషయం తెలిసి అమ్మాయిని, శ్రీకాంత్ రెడ్డి హైదరాబాద్ తీసుకువచ్చాడు కనకరాజు. జవహర్ నగర్ లోని ఒక ఇంట్లో ఇద్దరిని బంధించాడు కనకరాజు. పది రోజుల పాటు శ్రీకాంత్ రెడ్డి ని చిత్రహింసలకు గురి చేసిన కనకరాజు.. ఐదు రోజుల క్రితం శ్రీకాంత్ రెడ్డి ని చంపి స్మశాన వాటిక లో పూడ్చి పెట్టాడు. మద్యం మత్తులో శ్రీకాంత్ ను హత్య చేశానంటూ మిత్రులకు చెప్పాడు కనకరాజు. రాచకొండ ఎస్వోటీ పోలీసులకు సమాచారం రావడంతో కనకరాజును అదుపులో తీసుకున్నారు అధికారులు. పోలీసులు విచారించడంతో హత్య విషయాన్ని వెల్లడించాడు కనకరాజు. స్మశాన వాటిక లో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీశారు పోలీసులు. పోలీసుల సమక్షంలో స్మశాన వాటికలోనే శ్రీకాంత్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే.. హత్య చేసిన కనకరాజు టీఆర్‌ఎస్‌ నేత అని సమాచారం.

Related posts