మన జీవితంలో కొన్ని సాధారణమైన విషయాలను, అరుదైన ఘటనలను చూస్తూ ఉంటాము. అయితే కొన్ని అరుదైన సంఘటనలు మాత్రం మనిషి జీవితకాలంలో చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. అవి మళ్ళీ జరిగే అవకాశమే అస్సలు ఉండదు. అలాంటి అరుదైన విషయమే ఈరోజు రాత్రి ఆవిష్కృతమవ్వనుంది. అదేమిటంటే… కాస్త ఆలోచిస్తే ఎవరికైనా వెంటనే అర్థమైపోతుంది. అసలు విషయమేమిటంటే… ఈరోజు రాత్రి 8 గంటల 20 నిమిషాల 20 సెకండ్లకు ఆవిష్కృతమవ్వబోయే అద్భుతం ఏంటంటే… 20:20:20 2020…! అంటే 2020లో 20వ తేదీ 20 గంటల 20 నిమిషాల 20 సెకండ్లు. రాత్రి 8.20, 20 సెకండ్లకు రైల్వే టైం ప్రకారం 8ని 20గా పిలుస్తాం కదా…! అన్నీ 20లే అన్నమాట. ఈ టైం కు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈ అద్భుతం మళ్ళీ మన జీవితకాలంలో జరగనే జరగదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అద్భుతమే. ఏమంటారు…!!


