telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

అంధురాలైన ఆమెను కాపాడుకోవాల్సిన తండ్రే ఇలా…!?

Blind

వియత్నాంలో అంధురాలైన కూతురును జాగ్రత్తగా చూసుకోవాల్సిన తండ్రే ఆమెను తల్లిని చేసిన దారుణమైన ఘటన జరిగింది. 14 ఏళ్ల ఓ యువతి పుట్టుకతోనే అంధురాలు కావడంతో ఆమె తల్లే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ ఉండేది. ఏడాది క్రితం ఆమె క్యాన్సర్‌తో చనిపోవడంతో అంధురాలైన యువతిని చూసుకోడానికి ఎవరూ లేకుండా పోయారు. తల్లి చనిపోయాక తండ్రి మందుకు బానిస కావడంతో పట్టించుకునేవాడు కాదు. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండడంతో పరిస్థితిని చూసిన స్థానికులు తమకు తోచినంత సాయం చేస్తూ ఆ ఇంటిని నడిపిస్తున్నారు. ఓ రోజు యువతి గర్భం దాల్చినట్టు తెలుసుకున్న ఆమె స్కూలు యాజమాన్యం షాక్ అయింది. స్కూలులోనే ఎవరో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానించారు. బిడ్డ జన్మించాక డీఎన్‌ఏ పరీక్షలు చేయగా, ఈ దారుణానికి పాల్పడింది సొంత తండ్రే అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటికే ఇంట్లో నలుగురు పిల్లలుండగా… ఇప్పుడు మరో బిడ్డ పుట్టడంతో ఇల్లు గడవడం మరింత కష్టంగా మారిందని యువతి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

Related posts