telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వకీల్ సాబ్” తరువాతే మిగతా సినిమాల విడుదల…!

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 26వ సినిమా “వకీల్ సాబ్”. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో వైపు దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ‘వి’ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకి సిద్ధంగా ఉంది. నాని – సుధీర్ బాబు హీరోలు గా నటించిన ఈ చిత్రాన్ని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించారు. అయితే కరోనా ప్రభావం వల్ల కుదరలేదు.రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో రిస్క్ తీసుకోవడం ఎందుకని వేచి చూసే ధోరణిలో ఉన్నారట మిగిలిన నిర్మాతలంతా. ఇక థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారట. ముందుగా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ చెయ్యాలని దిల్ రాజు భావిస్తున్నడని తెలుస్తుంది. ముందుగా పవర్ స్టార్ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజయ్యే వరకు ఏ సినిమాలు రిలీజ్ చెయ్యను అని స్టేట్మెంట్ ఇచ్చేసాడట. దీంతో దిల్ రాజు రిలీజ్ మీద అధారపడ్డ వేరే బ్యానర్లు.. మీడియం రేంజ్ సినిమాల నిర్మాతలు గుండెలు పట్టుకున్నారట.

Related posts