telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మీ ఆశీర్వాద బలంతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను : సునీల్

Sunil

ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ అస్వస్థతకు గురైనట్టు గురువారం ఉదయం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సునీల్‌ను మాదాపూర్‌లోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో చేర్చారని, ఇటీవలి కాలంలో యాంటీ బయోటిక్స్ ఎక్కువగా వాడడం వల్లే సునీల్ అస్వస్థతకు గురైనట్టుగా.. సమాచారంతో పాటు హాస్పటల్‌లో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఈ వార్తలపై సునీల్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి, తన ఆరోగ్య పరిస్థతిపై క్లారిటీ ఇస్తూ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశారు. “మీ ఆశీర్వాద బలంతో నేను ఇప్పుడు బాగానే ఉన్నాను. నా ఆరోగ్యం పట్ల ఎంతగానో ఆందోళన చెందిన అందరికీ కృతజ్ఞతలు. నాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. రేపు(శుక్రవారం) విడుదల కాబోతున్న ‘డిస్కోరాజా’ చిత్రం చూసి అందరూ ఎంజాయ్ చేయండి” అని సునీల్ తన ట్వీట్‌లో తెలిపారు.

Related posts