telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సిద్దిపేటకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ సిద్దిపేట ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా పర్యటన కొనసాగుతోంది. గురువారం ఉదయం కొండపాక మండలం దుద్దెడ చేరుకున్న సీఎం… అక్కడ ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. సిద్ధిపేట పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని.. సిద్దిపేట చాలా డైనమిక్‌ ప్రాంతమని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. అతి త్వరలోనే సిద్ధిపేటకు ఎయిర్‌ పోర్టు రానుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.
సిద్దిపేట పట్టణం హైదరాబాద్‌ మహా నగరానికి అతి దగ్గరలో ఉందని తెలిపారు. అభివృద్ధిలో దూసుకుపోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా.. సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట అర్బన్‌ మండలం మిట్టపల్లిలో రైతు వేదికను ప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Related posts