టాలీవుడ్ స్టార్ హీరో వరుణ్‌తేజ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా అందరూ క్షేమంగా బయటపడ్డారు. తేజ్ కారులో ఉన్న నలుగురికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే మరో కారులో షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాల్మీకి షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తనకు ఎలాంటి గాయాలు కాలేదని వరుణ్ ట్వీట్ చేశారు.
previous post
next post


కశ్మీర్ విభజనపై కమల్‌హాసన్ సంచలన వ్యాఖ్యలు