ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో ఈ ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధర నేడు మరలా పెరిగింది. అంతర్జాతీయంగా ఈ ధరలు తగ్గినప్పటికీ, దేశీయంగా బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 53,610 కి పెరిచిన్ది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 49, 160 వద్ద ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ.47,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 51,490కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ.62,800కి చేరింది. వెండి విషయానికి వస్తే…హైదరాబాద్ కిలో వెండి ధర రూ. 900 పెరిగింది. దీంతో వెండి ధర రూ.62,800కు చేరింది. దీపావళి, పెళ్లిళ్ల సీజన్ లో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
previous post
next post