telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అందుకే జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు: అచ్చెన్నాయుడు

ache Naidu tdp

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు విరుచుకుపడ్డారు. శాసనసభలో బలం చూసుకుని రౌడీ యిజానికి పాల్పడటం దురదృష్టకరమని ఆయన మండిపడ్డారు.అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు.

తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా సమస్యలను పక్కదారి పట్టించడమే అవుతుందని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ నాడు తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు గడించారని ఆరోపించారు. ఇప్పుడేమో ప్రజలకు మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే జగన్ ను నిలదీస్తామని హెచ్చరించారు.

Related posts