మన సమాజంలో అక్రమ సంబంధాలు ప్రాణాంతకరం అనే విషయాలు అందరికి తెలిసిందే. బయటపడనంత వరకు ఇలాంటి సంబంధాలు బాగానే ఉంటాయి. బయటపడితేనే ఇబ్బందులు వస్తుంటాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న గుట్టల్లో లక్ష్మి అనే 35 సంవత్సరాల మహిళను ఆమె ప్రియుడు కుమార్ దారుణంగా హత్య చేసాడు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం పెద్ద మాటూరు గ్రామానికి చెందిన లక్ష్మి భర్త చనిపోవడంతో కుమార్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కుమార్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే, కుమార్ తో పాటుగా మహబూబ్ అంగర చెందిన విజయ్ అనే యువకుడితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధంగా మారింది. దీంతో కుమార్ లక్ష్మిని బ్లెడ్ తో గొంతుకోసి హత్య చేశాడు. హత్య అనంతరం కుమార్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
previous post
వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ