తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం తనకు ఆనందంగా ఉందని తెలంగాణలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆయన శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం అనంతరం తాను కీలక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి గురించి నిత్యం పరితపించే వ్యక్తి అని కితాబునిచ్చారు.
కేవలం నియోజకవర్గ సమస్యల కోసమే తాను అధికార పార్టీలో చేరుతున్నానన్నారు.
చంద్రబాబును కలిసిన తర్వాతే తాను పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నాననే ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.
ఆయన ఎక్కడ ఉన్నా తెలుగు రాష్ట్రాల బాగు కోరుకుంటారన్నారు.
చంద్రబాబు తన రాజకీయ గురువు కావడంతో కలిశానన్నారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.
తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు.
భయభ్రాంతులకు గురిచేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకుంటోందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
భయపడటానికి తాము చిన్నపిల్లలం కాదన్నారు. తమకు ఎక్కడా ఒత్తిడి లేదని, తమ ఇష్ట ప్రకారమే కాంగ్రెస్లోకి వెళ్తున్నామన్నారు.
జగన్ గారి మొసలి కన్నీరు ఎందుకు?: బుద్ధా వెంకన్న