telugu navyamedia
ఉద్యోగాలు తెలంగాణ వార్తలు వార్తలు

TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అభ్యర్థులకు హాల్ టికెట్స్ అధికారిక వెబ్సైట్ నందు అందుబాటులోవుంచాయి

TGPSC గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు తెలంగాణ  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నది.

ఈ క్రమంలోనే శనివారం హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ సూచించింది.

ఈ నెల 9న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనున్నది.

రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించినది.

గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4.03లక్షల మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుంచి కేంద్రాల్లోకి అభ్యర్థుల్ని అనుమతించనుండగా, పది దాటితే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇక అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నది .

Related posts