గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం ఉదయం శిల్పకళావేదికలో జరిగింది.
ప్రజల కథే నా ఆత్మకథ పేరుతో రాసిన ఈ పుస్తకం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మలకు అందచేసారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాసవర్మ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ మరియు పలువురు ప్రముఖులు హాజరైనారు.




జెంటిల్ మెన్ కు ప్రతిరూపం బండారు దత్తాత్రేయ , దత్తాత్రేయను దత్తన్న అని అభిమానంగా పిలుచుకుంటారు.
సాధారణ కార్యకర్త నుంచి జాతీయ నేతగా ఎదిగారు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, సంఘర్షణలు ఎదుర్కొన్నారు.
దత్తాత్రేయది పేరుకు హిందుత్వం, మతం భారతీయం దత్తాత్రేయ కోరుకుంది జనహితం ఆయనది లౌకికవాదం బండారు దత్తాత్రేయ పాటించేది మత సామరస్యం అని సీఎం చంద్రబాబు అన్నారు
అలయ్ బలయ్ పేరుతో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చారు అందరినీ కలిపేందుకు దత్తాత్రేయ వేదిక రూపొందించారు.
బండారు దత్తాత్రేయకు విరోధులు ఎవరూ ఉండరు దత్తాత్రేయకు ఏ రాజకీయ పార్టీ అనే వ్యత్యాసం ఉండదు . దత్తాత్రేయది ఆదర్శ రాజకీయ జీవితం అని చంద్రబాబు అన్నారు,

