telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జూనియర్‌ ఎన్టీఆర్‌ పై టీడీపీ నేత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ పై తెలుగు దేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల చేసిన వ్యాఖ్యలకు క్ష‌మాప‌ణ చెప్పాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇవాళ భార్యతో కలిసి తన నివాసంలో నిరసన దీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్బంగా వర్ల రామయ్య మాట్లాడుతూ…నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎఎన్టీఆర్‌ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు.

వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.

అటు బుద్దా వెంకన్న కూడా ఎన్టీఆర్‌పై కామెంట్స్‌ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రిలాగానో, ఆదిలాగానో స్పందిస్తాడనుకున్నామని, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జూనియర్ చెప్పారని ఎద్దేవా చేశారు. జూనియర్ స్పందన చూసి టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారని మండిపడ్డారు.

Related posts