telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి మృతి…

చైనా నుండి కరోనా వచ్చి ఏడాది దాటిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఈ కరోనా మహమ్మారి ఎవర్ని వదలడం లేదు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తగ్గలేదు.  సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఎవర్ని వదలడం లేదు.  ఇప్పటికే అనేకమంది నేతలు కరోనా బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కరోనాతో చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందారు.  గతనెల 13 వ తేదీన చల్లా రామకృష్ణారెడ్డి కరోనా బారిన పడ్డారు.  ఆ తరువాత ఆయన్ను చికిత్స కోసం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చల్లా ఆరోగ్యం క్షిణించడంతో వెంటిలేటర్ పై చికిత్సఅందించారు.  అయితే, వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మృతి చెందారు.  1983 నుంచి చల్లా రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో ఉన్న చల్లా వ్యవసాయ రంగంలో రైతుగా రాణించారు.  జాతీయ కృషి పండిట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు చల్లా.  అయితే ఆయన మృతికి పలువురు రాజకీయనాకులు సంతాపం తెలిపారు.

Related posts