telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయి.. కానీ…?

బెంగ‌ళూరు నిర్మాతతో సంబంధాలు అంటూ యువ‌హీరో త‌నీష్ పై ప‌లు చానెళ్లు క‌థ‌నాలు ప్రచారం చేయ‌‌డాన్ని ఆయన ఓ వీడియో ద్వారా  ఖండించారు. ‘బెంగ‌ళూరు నిర్మాత‌కు డ్ర‌గ్స్ కేసులో నోటీసులు వ‌చ్చిన మాట నిజం. నాకు నోటీసు వ‌చ్చింది. కానీ నాకు వ‌చ్చిన నోటీసు అర్థం ఏమిటో తెలుసుకోకుండా ఇష్టానుసారం కొన్ని మీడియాలు ప్ర‌చారం చేయ‌డం నా కుటుంబాన్ని తీవ్రంగా బాధించాయి’ అంటూ వాపోయారు త‌నీష్‌. అస‌లు బెంగ‌ళూరు నిర్మాత‌తో రెండేళ్లుగా ఎలాంటి సంప్ర‌దింపులు లేవు అని తెలిపారు.  ఈ కేసులో నాకు వ‌చ్చిన నోటీసుకు కార‌ణం వేరు. “ఫలానా వివ‌రం మీకు తెలుసా.. తెలిస్తే చెప్పండి!” అని మాత్ర‌మే అడిగేందుకు ఆ నోటీస్ ఇచ్చారు. నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యాన‌ని నోటీస్ పంప‌లేదు.. ఇది తెలుసుకోకుండా కొన్ని మీడియాలు ఇష్టానుసారం క‌థ‌నాలు అల్లేశాయి. నేను నా కుటుంబం చాలా క‌ల‌త‌కు గుర‌య్యాం. ద‌య‌చేసి ఇలాంటి అస‌త్య ప్ర‌చారం చేయొద్దు. కొన్ని మీడియాలు న‌న్ను సంప్ర‌దించి న్యాయ‌బ‌ద్ధంగా నిజాల్ని ప్ర‌చురించాయ‌ని’ త‌నీష్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. అయితే చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఏం జరగనుంది అనేది.

Related posts