telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కోయిలమ్మ సీరియల్‌ హీరో అమీర్‌ అరెస్ట్‌

లైంగిక వేధింపుల కేసులో బుల్లితెర నటుడు అమీర్‌ అలియాస్‌ సమీర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అమీర్‌ ప్రముఖ ఛానల్‌ వస్తున్న కోయిలమ్మ సీరియల్‌లో హీరో పాత్ర చేస్తున్నాడు. అయితే.. కొంత కాలం క్రితం స్నేహితులతో కలిసి మద్యం సేవించి… ఇద్దరు మహిళలపై సమీర్‌ దాడికి పాల్పడినట్టు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 5 లక్షల రూపాయలు తీసుకుని… తిరిగి చెల్లించమని అడిగినందుకు సమీర్‌ తమపై దాడి చేశాడంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. మణికొండలోని తమ ఇంటికి అనుచరులతో వచ్చి గొడవ చేశాడని కంప్లైంట్‌ ఇచ్చారు. దీంట్లో తన తప్పేమీ లేదని అమీర్‌ చెప్పుకొచ్చాడు. అయితే ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు… అమీర్‌ను అరెస్ట్‌ చేసి… కూకట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అమీర్‌కు రిమాండ్‌ విధించడంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.

Related posts