telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

నేడు బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ ​ కొనసాగుతోంది

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం పిలుపునిచ్చిన బీసీ బంద్ ఇవాళ ఉదయం 4 గంటల నుంచే మొదలైంది. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు నేతలు అడ్డుకున్నారు. తమ బంద్‌కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు.

రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో ఉండకపోయే అవకాశం ఉంది. అటు ఈ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి.

బీసీ జేఏసీ బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బంద్‌లో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బంద్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొననున్నారు.

ఉదయం 9 గంటలకు అంబర్ పేట బంద్‌లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎంపీ వీహెచ్ పాల్గొననున్నారు.

వేములవాడలో బంద్ లో పాల్గొన్న విప్ ఆది శ్రీనివాస్ . జేబీఎస్ దగ్గర బంద్ లో పాల్గొన్న ఈటల రాజేందర్. హనుమకొండలో పాల్గొన్న మధుసూదనాచారి.  సికింద్రాబాద్ లో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్.

సికింద్రాబాద్ రేథిఫైల్ బస్ స్టాండ్ వద్ద బంద్‌లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొననున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద బంద్‌లో మంత్రి వాకాటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ పాల్గొననున్నారు.

Related posts