telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధం..

తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డ్రగ్స్ ఛాలెంజ్‌పై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను దిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో ఎలాంటి పరీక్షలు చేయించుకోడానికైనా సిద్ధంగా ఉన్నానని ట్విటర్​ వేదికగా స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కూడా పరీక్షలు చేయించుకోవాలని సవాల్‌ చేశారు.

KTR takes charge as TRS Working President, to handle party affairs in  Telangana | The News Minute

చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి త‌న‌ది కాదని రేవంత్ ట్వీట్ కు అన్నారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్ట‌ర్ టెస్టుల‌కు రేవంత్ సిద్ధ‌మా? అని కేటీఆర్ సూటీగా ప్రశ్నింశారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వ‌స్తే రేవంత్ రెడ్డి త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పి, ప‌ద‌వులు వ‌దులుకునేందుకు రేవంత్ సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.

Hyderabad: Crimes up under TRS rule, charges Revanth Reddy

కాగా,..రెండు రోజుల కిందట‌.. మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి , కొండా విశ్వేశ్వర్‌ రెడ్డికి వైట్ ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్‌ టెస్ట్ చేసుకోవడానికి కేటీఆర్‌, విశ్వేశ్వర్‌ రెడ్డి సిద్ధం కావాలన్నారు. అమర వీరుల స్థూపం దగ్గరకు మంత్రి కేటీఆర్ రావాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డ్రగ్స్‌ టెస్ట్‌ చేసుకుని యువతకు ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యం లోనే తాజాగా మంత్రి కేటీఆర్.. డ్రగ్స్ టెస్ట్ లకు సిద్ధమని సంచలన ట్వీట్ చేశారు.

Related posts