telugu navyamedia
తెలంగాణ వార్తలు

నిర్ణయం తీసుకునే అధికారం వాళ్ల‌దే..

హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దళితబంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ రాజశేఖరరెడ్డిల ధర్మాసనం తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

నిష్పక్షపాత ఎన్నికలకు నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని హైకోర్టు వెల్లడించింది. మల్లేపల్లి లక్ష్మయ్య, జడ్సన్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఉప ఎన్నిక ముగిసే వరకు హుజూరాబాద్‌లో దళితబంధు పథకం నిలిపేయాలని ఈ నెల 18న ఈసీ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related posts