కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ డిల్లీ వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత ఉన్నారు.
మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ ఢిల్లీలో ఉండనున్నారు. ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంత వైద్యం చేయించుకున్నారు. వ్యక్తిగత వైద్యురాలు పూనియా ఆయనకు చికిత్స చేశారు.
చికిత్సలో భాగంగా మరోసారి వైద్యులను కలవనున్నట్లు సమాచారం. ఇటీవల సీఎం సతీమణి శోభ కూడా దిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
మరోవైపు వరి ధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల నిరసన చేపట్టనున్నారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు టీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
ఇప్పటికే ప్రధాని అపాయింట్‌మెంట్ సీఎంవో వర్గాలు కోరాయి. ధాన్యం అంశంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కేసీఆర్ కూడగట్టనున్నారు. ఎంపీ సంతోష్‌కుమార్ జైపూర్ టూర్‌లో ఉన్నారు. జైపూర్ నుంచి ఆయన నేరుగా డిల్లీకి వెళ్తారు.
టీఆర్‌ఎస్ అవినీతిపై బీజేపీ మాట్లాడటం సంతోషకరం: జీవన్ రెడ్డి