telugu navyamedia
తెలంగాణ వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

రేవంత్‌రెడ్డి ముందుగా తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులం గురించి చెప్పాలి: రఘునందన్ రావు

ప్రధాని నరేంద్ర మోదీ కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు  స్పందించారు.

రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ముందుగా తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కులం గురించి చెప్పాలని రేవంత్ రెడ్డిని కోరారు.

తప్పుడు మాటలు మాట్లాడిన వారందరూ చరిత్రలో కనుమరుగైపోయారని అన్నారు. ప్రధాని మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని, ప్రధాని మోదీ కేబినెట్‌లో 17 మంది బీసీ మంత్రులు ఉన్నారని, రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఇద్దరు బీసీ మంత్రులు మాత్రమే ఉన్నారని అన్నారు.

ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సీఎంకు సూచించారు. ఓసీ నుంచి బీసీ కులాన్ని మోదీ కులంగా మార్చారని రేవంత్ రెడ్డి అప్పుడే కనిపెట్టారని దుయ్యబట్టారు.

అంతకుముందు గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ బీసీ కాదని, చట్టబద్ధంగా మారిన బీసీ అని ఎగతాళి చేశారు.

మోదీ పుట్టుకతో అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి అని సీఎం అన్నారు. ‘‘2002లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని ఓసీ నుంచి బీసీల్లో చేర్చారు.

బీసీ అయితే ఇన్నాళ్లుగా కుల గణన ఎందుకు చేయలేదని రేవంత్ ప్రశ్నించారు. మోడీకి చిత్తశుద్ధి ఉంటే కుల గణనను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts