మీరు కేసీఆర్ సంగతి చూస్తారా? ఏం చూస్తారు కేసీఆర్ సంగతి…మీకు భయపడతానా?. సీఎం కేసీఆర్ అన్నారు. రాయగిరిలోని బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… జానగామలో నా మాటలకు బీజేపీ వాళ్లకు లాగులు తడిచాయి..మోదీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోంది. .పిచ్చి పిచ్చి పాలసీలు తెచ్చాయి.
మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు దేశాన్నినాశనం చేసిందని, మోదీ ప్రభుత్వం ఏ రంగానికీ న్యాయం చేయలేదని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం మెడమీద కత్తిపెట్టి కరెంట్ సంస్కరణ పేరుతో మీటర్లు పెట్టించిందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులిస్తాం లేకుంటే ఇవ్వబోమని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీని తరిమి తరిమి కొట్టాలని సూచించారు.
మోదీ ఈ దేశం నీ అయ్య సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. ఏడాదిపాటు రైతుల్ని ఏడిపించారు. రైతుల్ని అవమానించారు. గుర్రాలతో తొక్కించారు. చివరకు రైతుల మీద కార్లు కూడా ఎక్కించారు.
కర్ణాటకలో ఏం జరుగుతుందో చూస్తున్నాం .. ఆడబిడ్డలపై రాక్షసుల్లా పడుతున్నారు. విద్యార్థుల మధ్య మత కలహం పెడుతోంది బీజేపీ. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది నిజం కాదా. మోదీ ఉజ్వలమైన పరిపాలనలో పరిశ్రమలు మూతపడటం నిజం కాదా. ఏ రంగానికి మేలు చేసింది బీజేపీ ప్రభుత్వం’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

