telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

సస్పెండ్‌ పై ఏఐసీసీ కమిటీకీ సర్వే వివరణ

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు సర్వే సత్యనారాయణను ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీపీసీసీ సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం సర్వే  ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ ఏకే ఆంటోనికి వివరణ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కమిటీ సభ్యులు నిన్ను సస్పెండ్‌ చేయడమేంటని ఆంటోని అడిగారు. డోంట్‌ వర్రీ, ఫిర్యాదు రాసి ఇవ్వమన్నార’ని తెలిపారు.
అలాగే టీపీసీసీ అధ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ కుంతియాపై సర్వే మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తమ్‌, కుంతియాల వల్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని విమర్శించారు. తనను సస్పెండ్‌ చేసే అధికారం ఉత్తమ్‌కు లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Related posts