telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యురేనియం తవ్వకాలపై ఎవరికీ అనుమతి ఇవ్వలేదు: సీఎం కేసీఆర్

KCR cm telangana

సువిశాలమైన నల్లమల అడవుల్లో యురేనియం నిక్షేపాల వెలికితీత అంశం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం పై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ యురేనియం తవ్వకాలపై తమ ప్రభుత్వం ఎవరికీ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు.

భవిష్యత్ లో కూడా అనుమతులు ఇవ్వమని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై రేపటి శాసనసభ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన మండిపడ్డారు. ఆ పార్టీలాగా మభ్యపెట్టడం లాంటివి తాము చేయలేదని కేసీఆర్ పేర్కొన్నారు.

Related posts