telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

తెలంగాణ అసెంబ్లీ ఉద్యోగికి కరోనా పాజిటివ్!

Telangana assembly hyd

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా నెగెటివ్ ఉన్న వారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ పరీక్షలు నిర్వహించారు.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగికి ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ ఉద్యోగి నిన్న కూడా అసెంబ్లీలో విధులు నిర్వహించారు. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఉద్యోగికి కరోనా అని తేలడంతో ఆయనతో ఎవరెవరు కాంటాక్ట్ లోకి వచ్చారనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Related posts