telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బిల్లుల ఆమోదం కోసమే అసెంబ్లీ: చంద్రబాబు

chandrababu

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ సభ్యులు నల్లచొక్కాలతో హాజరయ్యారు. ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. విపక్షం గొంతు నొక్కేస్తున్నారని ఆరోపిస్తూ జగన్ సర్కారుపై చంద్రబాబు మండిపడ్డారు.
గడచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు.

ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకు మాత్రమే సమావేశమవుతోందని అన్నారు. ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ధి జగన్ సర్కారుకు లేదని మండిపడ్డారు. ఎక్కడా ఏ పనులూ జరగడం లేదని దుయ్యబట్టారు. సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ, ఈ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతోందనివిమర్శలు గుప్పించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభను, గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని ఆయన తెలిపారు

Related posts